అరబ్ లీగ్

 

అరబ్ లీగ్
جامعة الدول العربية
Jāmiʿat ad-Duwal al-ʿArabiyya
సభ్యదేశాలు ముదురు ఆకుపచ్చ రంగులో; సస్పెండైన దేశాలు లేత ఆకుపచ్చలో
సభ్యదేశాలు ముదురు ఆకుపచ్చ రంగులో; సస్పెండైన దేశాలు లేత ఆకుపచ్చలో
సభ్యదేశాలు ముదురు ఆకుపచ్చ రంగులో; సస్పెండైన దేశాలు లేత ఆకుపచ్చలో
పరిపాలక కేంద్రంకైరో
Official languages
  • అరబిక్
Demonym అరబ్బులు
Type ప్రాంతీయ సంస్థ
సభ్యులు
Leaders
 -  సెక్రెటరీ జనరల్
 -  పార్లమెంటు స్పీకరు
 -  కౌన్సిల్ అధ్యక్ష పదవి  Sudan
Legislature అరబ్ పార్లమెంటు
Area
 -  మొత్తం విస్తీర్ణం 1,31,32,327 km2 (2nd)
50,70,420 sq mi 
Population
 -  2018 estimate 40,67,00,000[2] (3rd)
 -  Density 27.17/km2
70.37/sq mi
GDP (nominal) 2021 estimate
 -  Total $2.7 trillion[3] (8th)
 -  Per capita $6,600
Currency
  • అల్జీరియా Algerian dinar
  • బహ్రెయిన్ Bahraini dinar
  • Comoros Comorian franc
  • జిబూటి Djiboutian franc
  • ఈజిప్టు Egyptian pound
  • ఇరాక్ Iraqi dinar
  • జోర్డాన్ Jordanian dinar
  • కువైట్ Kuwaiti dinar
  • Lebanon Lebanese pound
  • లిబియా Libyan dinar
  • మౌరిటానియ Mauritanian ouguiya
  • మొరాకో Moroccan dirham
  • ఒమన్ Omani rial
  • ఖతార్ Qatari riyal
  • సౌదీ అరేబియా Saudi riyal
  • సొమాలియా Somali shilling
  • సూడాన్ Sudanese pound
  • సిరియా Syrian pound
  • ట్యునీషియా ట్యునీసియా దీనార్
  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE దిర్‌హం
  • యెమెన్ యెమెనీ రియాల్
Time zone (UTC+0 to +4)
Website
www.LasPortal.org
a. 1979 నుండి 1989 వరకు, ట్యునిస్ ట్యునీషియా.
b. సిరియన్ అరబ్ రిపబ్లిక్‌ను సస్పెండు చేసారు.

అరబ్ లీగ్ అరబ్ ప్రపంచంలోని ప్రాంతీయ సంస్థ. ఇది ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికా, తూర్పు ఆఫ్రికా, పశ్చిమ ఆసియాలో ఉంది. అధికారికంగా దీని పేరు లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్. అరబ్ లీగ్ కైరోలో 1945 మార్చి 22 న మొదట్లో ఈజిప్ట్, ఇరాక్, ట్రాన్స్‌జోర్డాన్ (1949లో జోర్డాన్ అని పేరు మార్చారు), లెబనాన్, సౌదీ అరేబియా, సిరియా అనే ఆరుగురు సభ్యులతో ఏర్పడింది. యెమెన్ 1945 మే 5 న సభ్యునిగా చేరింది. ప్రస్తుతం, లీగ్‌లో 22 మంది సభ్యులు ఉన్నారు [4] అయితే 2011 నవంబరు నుండి సిరియాను సస్పెండు చేసారు.

లీగ్ ప్రధాన లక్ష్యం "సభ్య దేశాల మధ్య సంబంధాలను మరింత దగ్గర చేయడం, వాటి మధ్య సహకారాన్ని సమన్వయం చేయడం, వారి స్వాతంత్ర్యం, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, సాధారణంగా అరబ్ దేశాల వ్యవహారాలు, ప్రయోజనాలను పరిగణించడం". [5] సంస్థ చరిత్రలో సాపేక్షంగా తక్కువ స్థాయిలో సహకారాన్ని పొందింది. [6]

అరబ్ లీగ్ ఎడ్యుకేషనల్, కల్చరల్ అండ్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ (ALECSO), దాని కౌన్సిల్ ఆఫ్ అరబ్ ఎకనామిక్ యూనిటీ (CAEU) యొక్క ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ వంటి సంస్థల ద్వారా రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, శాస్త్రీయ, సామాజిక రంగాల్లో అరబ్ ప్రపంచపు ప్రయోజనాలను ప్రోత్సహించడానికి లీగ్‌ను ఏర్పరచారు. [7][8] ఇది సభ్య దేశాల విధానాలను సమన్వయం చేయడానికి, ఉమ్మడి ఆందోళనకు సంబంధించిన విషయాలపై అధ్యయనాలకు కమిటీలను ఏర్పాటు చేయడానికి, అంతర్-దేశ వివాదాలను పరిష్కరించుకోవడానికి, 1958 లెబనాన్ సంక్షోభం వంటి సంఘర్షణలను పరిమితం చేయడానికి ఒక వేదికగా పనిచేసింది. ఆర్థిక ఏకీకరణను ప్రోత్సహించే అనేక మైలురాయి పత్రాల ముసాయిదాలు, తీర్మానాల కోసం లీగ్ ఒక వేదికగా పనిచేసింది. ఒక ఉదాహరణ జాయింట్ అరబ్ ఎకనామిక్ యాక్షన్ చార్టర్. ఇది ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన సూత్రాలను వివరిస్తుంది.

అరబ్ లీగ్ ఆఫ్ స్టేట్స్ ఏర్పాటు నాటి స్మారక స్టాంపు. ఇందులో 8 స్థాపక దేశాల జెండాలు ఉన్నాయి. అవి: ఈజిప్ట్, సౌదీ అరేబియా, ముతవాక్కిలైట్ కింగ్‌డమ్ ఆఫ్ యెమెన్ (ఉత్తర యెమెన్), సిరియన్ రిపబ్లిక్, హాషెమైట్ కింగ్‌డమ్ ఆఫ్ ఇరాక్, హాషెమైట్ కింగ్‌డమ్ ఆఫ్ జోర్డాన్, లెబనీస్ రిపబ్లిక్, పాలస్తీనా

అరబ్ లీగ్ కౌన్సిల్‌లో ప్రతి సభ్య దేశానికి ఒక ఓటు ఉంటుంది. నిర్ణయాలకు అనుకూలంగా వారికి ఓటు వేసిన దేశాలకు మాత్రమే వర్తిస్తాయి. 1945లో లీగ్ లక్ష్యాలు దాని సభ్యుల రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక కార్యక్రమాలను బలోపేతం చేయడం, సమన్వయం చేయడం, సభ్యుల మధ్య లేదా సభ్యులకు బయటి పక్షాలకూ మధ్య ఉన్న వివాదాలను మధ్యవర్తిత్వం చేయడంగా ఉండేవి. ఇంకా, 1950 ఏప్రిల్ 13 న జాయింట్ డిఫెన్స్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఒప్పందంపై సంతకం చేయడంతో సైనిక రక్షణ చర్యల సమన్వయానికి కూడా సభ్యులు కట్టుబడి ఉన్నారు. 2015 మార్చిలో అరబ్ లీగ్ జనరల్ సెక్రటరీ, అరబ్ దేశాల్లో తీవ్రవాదాన్ని, ఇతర బెదిరింపులనూ ఎదుర్కొనే లక్ష్యంతో జాయింట్ అరబ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. యెమెన్‌లో ఆపరేషన్ డిసైసివ్ స్టార్మ్ తీవ్రరూపం దాల్చుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టులో పాల్గొనడం స్వచ్ఛందంగా ఉంటుంది. సభ్య దేశాలలో ఒకదాని అభ్యర్థన మేరకు మాత్రమే సైన్యం జోక్యం చేసుకుంటుంది. అనేక సభ్య దేశాలలో సైనిక ఆయుధాల పెంపుదల, అంతర్యుద్ధాలు అలాగే తీవ్రవాద ఉద్యమాలు JAF ఏర్పాటుకు ప్రేరణగా నిలిచాయి. దీనికి ధనిక గల్ఫ్ దేశాలు ఆర్థిక సహాయం చేసాయి. [9]

1970వ దశకం ప్రారంభంలో ఎకనామిక్ కౌన్సిల్, యూరోపియన్ దేశాల్లో అంతటా జాయింట్ అరబ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్‌ను రూపొందించే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. దాని డిక్రీ K1175/D52/G ప్రకారం అరబ్ బ్రిటిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటుకు దారితీసింది. అరబ్ ప్రపంచం, తమ ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించడం సులభతరం చేయడం దీని లక్ష్యం.

భౌగోళికం

సభ్య దేశాలలో చేరిన తేదీలు; కొమొరోస్ (సర్కిల్ చేయబడింది) 1993లో చేరింది.



</br>  1940లు  1950లు  1960లు  1970లు

అరబ్ లీగ్ సభ్య దేశాలు 1,30,00,000 చ.కి.మీ. పైగా వైశాల్యంలో, ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో సహారా వంటి ఎడారులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే, నైలు లోయ, హార్న్ ఆఫ్ ఆఫ్రికాలోని జుబ్బా లోయ, షెబెల్లే లోయ, మాగ్రెబ్‌లోని అట్లాస్ పర్వతాలు, మెసొపొటేమియా, లెవాంట్‌లలో విస్తరించి ఉన్న సారవంతమైన నెలవంక వంటి అత్యంత సారవంతమైన భూములు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో దక్షిణ అరేబియాలోని దట్టమైన అడవులు, ప్రపంచంలోని అతి పొడవైన నది నైలులోని కొంత భాగం ఉన్నాయి.

సభ్యత్వం

అరబ్ లీగ్ చార్టరును, అరబ్ దేశాల ఒప్పందం అని కూడా పిలుస్తారు. ఇది అరబ్ లీగ్ వ్యవస్థాపక ఒప్పందం. 1945లో దీన్ని ఆమోదించారు. ఇది "లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ ఈ ఒప్పందంపై సంతకం చేసిన స్వతంత్ర అరబ్ దేశాలతో కూడుకుని ఉంటుంది" అని నిర్దేశిస్తుంది. [10]

మొదట్లో 1945లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. నేడు, అరబ్ లీగ్‌లో 22 మంది సభ్యులు ఉన్నారు, వీటిలో మూడు ఆఫ్రికన్ దేశాలు విస్తీర్ణంలో అతిపెద్దవి (సూడాన్, అల్జీరియా, లిబియా). పశ్చిమ ఆసియాలో అతిపెద్ద దేశం సౌదీ అరేబియా.


20వ శతాబ్దపు రెండవ భాగంలో సభ్యత్వం పెరుగుతూ వచ్చింది . 2020 నాటికి, 22 సభ్య దేశాలు ఉన్నాయి:

5 పరిశీలక స్థాయి దేశాలు (గమనిక: కింది పరిశీలకుల దేశాలను ఎంచుకున్న అరబ్ లీగ్ సెషన్‌లలో పాల్గొనడానికి ఆహ్వానించారు, కానీ వాటికి ఓటింగ్ అధికారాలు ఉండవు):

1979 మార్చి 26 న, ఈజిప్ట్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం కారణంగా అరబ్ లీగ్ నుండి ఈజిప్టును సస్పెండ్ చేసారు; తర్వాత 1989 మే 23 న తిరిగి తీసుకున్నారు.

లిబియా అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత 2011 ఫిబ్రవరి 22 న లిబియాను సస్పెండ్ చేసారు. [16] నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్, పాక్షికంగా గుర్తింపు పొందిన లిబియా మధ్యంతర ప్రభుత్వం, లిబియాను సంస్థలోకి తిరిగి చేర్చుకోవాలా వద్దా అనే చర్చలో పాల్గొనేందుకు ఆగస్టు 17న అరబ్ లీగ్ సమావేశంలో కూర్చోవడానికి ఒక ప్రతినిధిని పంపింది. [17]


2011 నవంబరు 16 న సిరియాను సస్పెండ్ చేసారు. 2013 మార్చి 6 న, అరబ్ లీగ్, లీగ్‌లో సిరియా స్థానాన్ని సిరియన్ జాతీయ కూటమికి ఇచ్చింది. [18] 2014 మార్చి 9 న, సెక్రటరీ జనరల్ నబిల్ అల్-అరబీ మాట్లాడుతూ, ప్రతిపక్షం దాని సంస్థల ఏర్పాటును పూర్తి చేసే వరకు సిరియా సీటు ఖాళీగా ఉంటుందని చెప్పాడు. [19]

శిఖరాగ్ర సమావేశాలు

No.DateHost CountryHost City
11964 జనవరి 13-17  United Arab Republicకైరో
21964 సెప్టెంబరు 5-11  United Arab Republicఅల్గ్జాండ్రియా
31965 సెప్టెంబరు 13-17  Moroccoకాసాబ్లాంకా
41967 ఆగస్టు 29  Sudanఖార్తూమ్
5డిసెంబరు 1969 21–23  Moroccoరబాత్
61973 నవంబరు 26– 28  Algeriaఅల్జీర్స్
71974 అక్టోబరు 29  Moroccoరబాత్
81976 అక్టోబరు 25– 26  Egyptకైరో
91978 నవంబరు 2– 5  Iraqబాగ్దాద్
101979 నవంబరు 20– 22  Tunisiaట్యునిస్
111980 నవంబరు 21– 22  Jordanఅమ్మన్
121982 సెప్టెంబరు 6– 9  Moroccoఫెస్
131985  Moroccoకాసాబ్లాంకా
141987  Jordanఅమ్మన్
151988 జూన్  Algeriaఅల్జీర్స్
161989  Moroccoకాసాబ్లాంకా
171990  Iraqబాగ్దాద్
181996  Egyptకైరో
192001 మార్చి 27– 28  Jordanఅమ్మన్
202002 మార్చి 27– 28  Lebanonబీరూట్
212003 మార్చి 1  Egyptషాం ఎల్ షేక్
222004 మే 22–23  Tunisiaట్యునిస్
232005 మార్చి 22– 23  Algeriaఅల్జీర్స్
242006 మార్చి 28– 30  Sudanఖార్తూమ్
252007 మార్చి 27– 28  Saudi Arabiaరియాధ్
262008 మార్చి 29– 30  Syriaడెమాస్కస్
272009 మార్చి 28– 30  Qatarదోహా
282010 మార్చి 27– 28  Libyaసిర్తే
292012 మార్చి 27– 29  Iraqబాగ్దాద్
302013 మార్చి 21– 27  Qatarదోహా[20]
312014 మార్చి 25– 26  Kuwaitకువైట్ నగరం[21]
322015 మార్చి 28– 29  Egyptషాం ఎల్ షేక్[22]
332016 జూలై 20  Mauritaniaనౌక్‌చోట్
342017 మార్చి 23– 29  Jordanఅమ్మన్[23]
352018 ఏప్రిల్ 15  Saudi Arabiaధహాన్
362019 మార్చి 31  Tunisiaట్యునిస్[24]
372022 నవంబరు 1  Algeriaఅల్జీర్స్
2013 అరబ్ లీగ్ సమ్మిట్ లోగో

సైన్యం

అరబ్ లీగ్ జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్, అరబ్ లీగ్ కింద ఉన్న సంస్థలలో ఒకటి. [25] అరబ్ లీగ్ సభ్య దేశాల ఉమ్మడి రక్షణను సమన్వయం చేసేందుకు 1950 నాటి జాయింట్ డిఫెన్స్ అండ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ ట్రీటీ నిబంధనల ప్రకారం దీన్ని స్థాపించారు.

ఐరాస మాదిరిగానే, ఒక సంస్థగా అరబ్ లీగ్‌కు స్వంత సైనిక దళం లేదు. కానీ 2007 శిఖరాగ్ర సమావేశంలో, నాయకులు తమ ఉమ్మడి రక్షణను తిరిగి సక్రియం చేయాలని, దక్షిణ లెబనాన్, డార్ఫర్, ఇరాక్, తదితర హాట్ స్పాట్‌లలో మోహరించడానికి శాంతి పరిరక్షక దళాన్ని ఏర్పాటు చేయాలనీ నిర్ణయించుకున్నారు.

2015లో ఈజిప్టులో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో సభ్య దేశాలు ఉమ్మడి సైనిక దళాన్ని ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. [26]

అత్యవసర శిఖరాగ్ర సమావేశాలు

నం.తేదీఆతిధ్య దేశముహోస్ట్ సిటీ
11970 సెప్టెంబరు 21– 27 కైరో
21976 అక్టోబరు 17– 28 రియాద్
31985 సెప్టెంబరు 7– 9 కాసాబ్లాంకా
41987 నవంబరు 8– 12 అమ్మన్
51988 జూన్ 7– 9 అల్జీర్స్
61989 జూన్ 23– 26 కాసాబ్లాంకా
71990 మార్చి 28– 30 బాగ్దాద్
81990 ఆగస్టు 9– 10 కైరో
91996 జూన్ 22– 23 కైరో
102000 అక్టోబరు 21– 22 కైరో
112016 జనవరి 7 రియాద్

అక్షరాస్యత

సభ్య దేశాలు ఇచ్చిన స్వీయ-డేటా ఆధారంగా అక్షరాస్యుల సంఖ్యను అంచనా వేసారు. కొందరు విద్యా ప్రాప్తి డేటాను ప్రాక్సీగా ఉపయోగించినప్పటికీ, పాఠశాల హాజరు లేదా గ్రేడ్ పూర్తి చేయడంలో తేడా ఉండవచ్చు. దేశాల్లో నిర్వచనాలు, డేటా సేకరణ పద్ధతులు మారుతూ ఉంటాయి కాబట్టి, అక్షరాస్యత అంచనాల్లో కొంత తేడాలు ఉండవచ్చు.పెర్షియన్ గల్ఫ్ ప్రాంతం చమురు విజృంభణను కలిగి ఉందని, మరిన్ని పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడానికి వీలు కల్పిస్తుందని కూడా గమనించడం ముఖ్యం.

ర్యాంక్దేశంఅక్షరాస్యత రేటు
1 97.3 [27]
2 96.5 [27]
3 96.3 [27]
4 95.7 [27]
5 95.4 [27]
6 94.4 [27]
7 93.9 [27]
8 93.8 [27]
9 91.1 [27]
10 91 [27]
11 86.4 [27]
12 85.7 [27]
13 81.8 [27]
14 81.8 [27]
15 80.2 [27]
16 75.9 [27]
17 73.8 [27]
18 70.1 [27]
19 70.0
20 68.5 [27]
21 52.1 [27]
22 44–72 [28]

జనాభా వివరాలు

అరబ్ లీగ్, 22 సభ్య దేశాలతో కూడిన సాంస్కృతికంగా, జాతిపరమైన సంఘం. లీగ్ జనాభాలో అత్యధికులు అరబ్బులు. 2013 జూలై 1 నాటికి, అరబ్ లీగ్ దేశాల్లో దాదాపు 35.9 కోట్ల మంది నివసిస్తున్నారు. ఇతర ప్రపంచ ప్రాంతాల కంటే దీని జనాభా వేగంగా పెరుగుతోంది. దాదాపు 10 కోట్ల జనాభాతో అత్యధిక జనాభా కలిగిన సభ్య దేశం ఈజిప్ట్. [29] 6 లక్షల మందితో అతి తక్కువ జనాభా కలిగిన దేశం కొమొరోస్ .

మతం

అరబ్ లీగ్ పౌరులలో ఎక్కువ మంది ముస్లిములు. క్రైస్తవ మతం రెండవ అతిపెద్ద మతం. ఈజిప్ట్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, పాలస్తీనా, సూడాన్, సిరియాల్లో కనీసం 1.5 కోట్ల మంది క్రైస్తవులు నివసిస్తున్నారు. అదనంగా, డ్రూజ్, యాజిడిలు, షబాక్స్, మాండయన్లు చిన్నవి కానీ గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. మతం లేని అరబ్బుల సంఖ్యలు సాధారణంగా అందుబాటులో ఉండవు, కానీ ప్యూ ఫోరమ్ పరిశోధన ప్రకారం మేనా ప్రాంతంలో 1% మంది ప్రజలు "ఏ మతానికీ చెందని వారు". [30]

భాషలు

అరబ్ లీగ్ అధికారిక భాష అరబిక్. ఇది క్లాసికల్ అరబిక్ ఆధారంగా ఉంది. అయితే, అనేక కొన్ని సభ్య దేశాల్లో సోమాలి, అఫర్, కొమోరియన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, బెర్బెర్, కుర్దిష్ వంటి ఇతర సహ-అధికారిక లేదా జాతీయ భాషలు కలిగి ఉన్నాయి. చాలా దేశాలలో, వివిధ అరబిక్ మాండలికాలు ప్రబలంగా ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

మూలాలు